గ్రామస్థాయి నుంచి బలోపేతం దిశగా వైఎస్పార్సీపీ అడుగులు

5 Jun, 2014 22:20 IST|Sakshi

రాజమండ్రి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విశ్లేషిస్తూనే, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా, ప్రతి కార్యకర్తలో మనోస్థైర్యాన్ని నింపే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యేందుకు దారితీసిన పరిస్థితులపై లోతైన పరిశీలన చేపట్టింది. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, పురోగమించే దిశగా ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయి సమీక్షకు శ్రీకారం చుట్టింది.

ఆ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాజమండ్రిలో రెండోరోజూ క్షేతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్యకర్తనూ పేరుపేరునా పలకరించారు. అరకు, అమలాపురం, విజయనగరం జిల్లాల నేతలతో వైఎస్ జగన్ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో కార్యర్తల సూచనలు, సలహాలు వైఎస్ జగన్ ఓపిగ్గా విన్నారు. మరికొందరు కార్యకర్తలు, నాయకులు పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని అధినేతకు విన్నవించారు.

మరిన్ని వార్తలు