టీడీపీ నేతల దౌర్జన్యం: వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల కిడ్నాప్‌

11 Apr, 2019 08:30 IST|Sakshi

దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు

ఏజెంట్‌పై చేయి చేసుకున్న సీఎం రమేష్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల కిడ్నాప్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రశాంతంగా పోలింగ్‌ జరగకుండా ప్రత్యర్థి అభ్యర్థులపై దాడులకు పాల్పడుతూ... హింస సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. తాజాగా పోలింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఏజెంట్ల కిడ్నాప్‌ కలకరం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమందలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. ఏజెంట్లను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకుని వారిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అతని ఫోన్‌, కెమెరాను ధ్వంసం చేసి బెదిరింపులకు దిగారు. 

  • వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డిలు అక్కడి చేరుకున్నారు.
  • చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌. 31లో టీడీపీ నేతలకు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నారంటూ కొందరు మహిళలను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో మహిళలకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
  • పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంనగర్‌ 9వ రోడ్డులోని పోలింగ్‌బూత్‌లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడికి పాల్పడ్డారు. రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజుపై బుజ్జి వర్గీయులు మరోసారి డాడికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ.. టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. 
  • మరోవైపు వైఎస్సార్‌ కడప జిల్లాలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. ఓటర్‌ స్లిప్‌లు పంచుతూ.. గుర్తులు చెప్తున్న టీడీపీ నేతలను ప్రశ్నించినందుకు యర్లగుంట్ల మండలం పోట్లదుర్తి కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై సీఎం రమేష్‌ చేయి చేసుకున్నారు.  కిృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని చెప్తూ.. దేవినేని ఉమామహేశ్వరరావు వర్గీయులు ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారు. వారిని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దౌర్జాన్యానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  
  • అనంతరపురం జిల్లా యల్లనురు మండలం జంగంపల్లిలో టీడీపీ నేతల అరచకాలు కొనసాగుతున్నాయి. ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వారిని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. 
  • వైఎస్సార్‌ జిల్లా చక్రయపేట మండలం తిమ్మరెడ్డిగారిపల్లెలో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. క్యూలైన్ల్‌లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చూస్తే.. కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు