గడపగడపకూ.. మహోద్యమం

9 Jul, 2016 01:52 IST|Sakshi

జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి అనూహ్య స్పందన
{పభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  మహానేత పాలనను స్మరించుకున్న ప్రజలు
నాయకుల ముందు గోడు వెళ్లబోసుకున్న జనం

విశాఖపట్నం బాబయ్యా..! ఉన్న పింఛను తీసేశారు.. కొత్త పింఛను ఇవ్వడం లేదు. రెండేళ్లుగా  తిరుగుతున్నా ఇంటి జాగా ఇవ్వలేదు..ఇంటి రుణం ఇవ్వలేదు. బాబొస్తే జాబన్నారు.. ఉన్న ఉద్యో గాలను తీసేశారు.  రైతు, డ్వాక్రా రుణమాఫీ అని నమ్మి ఓట్లేశాం..ఇప్పుడు అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఇలా వెళ్లిన ప్రతిచోటా ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో పడుతున్న అవస్థలను ఏకరవుపెట్టారు. అధిష్టానం పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన గడపగడపకు వైఎస్సార్‌సీపీ మహోద్యమంలా సాగింది. వాతావరణం అనుకూలించకపోయినా పార్టీ నేతలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లి పోయారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్ అంటూ ఊరూ..వాడా హోరెత్తిపోయింది. బైకు ర్యాలీలు..పాదయాత్రలతో పార్టీ శ్రేణులు తొలి రోజే కదం తొక్కారు. ప్రతీ గడపకు వెళ్లి బాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. వంద ప్రశ్నలతో పార్టీ రూపొందించిన కరపత్రాలను ప్రతీ ఒక్కరికి పంచిపెట్టి వారి మనోగతాన్ని అడిగితెలుసుకున్నారు. బాబు పాలనకు మీరెన్ని మార్కు లేస్తారో చెప్పండంటూ నేతలు కోరిన ప్రతిచోటా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రెండేళ్ల పాలన పూర్తిగా దోపిడీయే తప్ప ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని ప్రజలే తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తారు.

 
దుష్టపాలన సాగుతోంది ః అమర్

రాష్ర్టంలో దుష్టపాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. అనకాపల్లినరసింగరావుపేటలో గడపగడపకు వైఎస్సార్‌సీపీలో పాల్గొన్నారు. దుర్గాలాడ్జివీధిలో చింతా అన్నపూర్ణ ఇంటి నుంచి ప్రారంభించారు. బాబు రెండేళ్ల పాలన వైఫల్యాలను ప్రతిచోటా అమర్‌నాథ్ ప్రస్తావించారు. రేషన్ దుకాణాల్లో 9 సరుకులు ఇస్తానని చెప్పి మూడే ఇవ్వడంతో తాము ఇబ్బందిపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు లాలం రాంబాబు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, జిల్లాపార్టీ ప్రధాన కార్యదర్శి దంతులూరి శ్రీధర్‌రాజు, పట్టణపార్టీ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు పాల్గొన్నారు.

 
పాలనకు చరమగీతంః ఎమ్మెల్యే గిడ్డి

అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు సర్కార్‌కు చమరగీతం పాడేందుకు ప్రజలుసిద్ధంగా ఉన్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. పాడేరు చాకలిపేటలో గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ ముద్రించిన నాలుగు పేజీల కరపత్రాలను, చంద్రబాబు పాలనపై 100 ప్రశ్నలతో ఉన్న బ్యాలట్‌ను ప్రజలకు పంపిణీ చేశారు. మహిళలు ఎమ్మెల్యేకు ఎదురేగి స్వాగతం పలికారు. పాడేరు, చింతపల్లి జెడ్పీటీసీ సభ్యులు పి.నూకరత్నం, కె.పద్మ కుమారి, జి.మాడుగుల, జీకేవీధి ఎంపీపీలు ఎంవిగంగరాజు, ఎస్ బాలరాజు పాల్గొ న్నారు.

 
బాబుకు ప్రజలే మార్కులు వేయాలిః బూడి

చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, నెరవేరిన, నెరవేర్చని సమస్యలపై ప్రజాబ్యాలెట్‌లో ప్రశ్నలకు మార్కులు  ప్రజలే వేయాలని  ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రజలకు పిలుపు నిచ్చారు. ఎమ్యెల్యే బూడి మాడుగుల పాత బస్టాండ్ నుంచి కోటవీధి,గరవ వీది, పెదకోమటి వీధి మీదుగా బస్టాండ్ వరకు ఇంటింటికీ వెళ్లారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే కాలం ఎంతో దూరంలో లేదని ద్వజమెత్తారు.

 
బాబు పాలనలో అన్నీ కష్టాలే ః మాజీ ఎమ్మెల్యే గొల్ల

బాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే,పాయకరావుపేట కో-ఆర్డినేటర్ గొల్ల బాబూరావు అన్నారు. పార్టీ కో ఆర్డినేటర్, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు చిక్కాల రామారావు, పార్టీ సీజీసీసభ్యుడు, కో-ఆర్డినేటర్ వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్య నారాయణరాజుతో కలిసి పాయకరావుపేట కుమారపురంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో పాల్గొ న్నారు. బైకు ర్యాలీలు..పాదయాత్రలతో హోరెత్తించారు.

 
ప్రజలే బుద్ధి చెప్పాలిః ప్రగడ

రాష్ట్రంలోని అవినీతి, అసమర్థప్రభుత్వంలో మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని యలమంచిలి మండలం ఏటికొప్పాకలో ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన కరపత్రంతో పాటు నియోజకవర్గ సమస్యలపై ముద్రించిన కరపత్రాన్ని అందజేశారు. అదే విధంగా అదనపు కో- ఆర్డినేటర్ బొడ్డేడి ప్రసాద్ మునగపాక మండలం ఉమ్మలాడలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 
ఈ పాలన మాకొద్దంటున్న ప్రజలుః పెట్ల

చంద్రబాబు పాలన మాకొద్దంటూ ప్రజలుముక్తకంఠంతో కోరుతున్నారని నర్సీపట్నం కో-ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్ అన్నారు. పెదజగ్గంపేటలో ఇంటింటికీ వెళ్లారు. తొలుత ఎ. లక్ష్మి ఇంటికి వెళ్లి  పార్టీ రూపొం దించిన ప్రజా బ్యాలెట్‌ను అందజేసి, ప్రభుత్వం   ఇచ్చిన హమీలను అమలు ఏలా ఉందని అడిగారు. చంద్రబాబు దయ వల్ల మా డ్వాక్రా గ్రూపు ఆగి పోయింది.  ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేస్తానని చెప్పడంతో తామంతా అప్పులు కట్టడం మానేశాం. తర్వాత మాఫీ చేయకపోవడంతో తడిపిమోపుడైయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 
అసమర్ధపాలన వల్లే కష్టాలుః కరణం

చంద్రబాబు అసమర్థపాలన వల్లే ప్రజలు కష్టాలపాలవుతున్నారని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. రోలుగుంట 4,5 వార్డుల్లో గడపగడపకు కలియ తిరిగారు. 80 ఏళ్లు పైబడినా తనకు వృద్ధాప్య ఫించన్ రాలేదని వారా దేముడు, రేషన్ కార్డు కోసం తిప్పుతున్నారని వి.అప్పలనర్స, తనకు ఇళ్లు మంజూరు కాలేదని రుత్తుల దేముడు, రుణమాఫీ ఉత్త మోసమని పెట్టా దేముడమ్మ,విశ్వ భ్రాహ్మణుల కాలనీవాసులు ధర్మశ్రీ ఎదుట తమ సమస్యలు ఎక రవు పెట్టారు.

 
గిరిజనుల గుండెల్లో వైఎస్సార్...

గిరిజనుల గుండెల్లో వైఎస్సార్ కొలువై ఉన్నారని..ఆయన అందజేసిన సంక్షేమ అభ వృద్ధి కార్యక్రమాలను గిరిజనులెవ్వరూమరిచిపోరని అరకు అసెంబ్లీ నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యురాలు అరుకు ఎంపీపీ కె.అరుణకుమారి అన్నారు. త్రిసభ్యసభ్యులైన  అరుణ కుమారి అరుకులోనూ జసింగి సూర్యనారాయణ పెదబయలులోనూ, పోయా రాజారావు హుకుం పేటలోవేర్వేరుగా గడప గడపకు వైఎస్సార్‌సీపీలో పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు