విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట

24 Mar, 2015 09:09 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది.  మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా తన ముసుగును తొలగిస్తున్నారు. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఆయన కొత్తగా విద్యుత్ చార్జీల మోత మోగించేందుకు రంగం సిద్ధం చేశారు. చార్జీల పెంపుతో  వినియోగదారులపై  రూ.941 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటాన్ని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

దాంతో  చంద్రబాబు నాయుడు సర్కార్ను నిలదీసేందుకు వైఎస్ఆర్ సీపీ సమాయత్తం అవుతోంది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే విద్యుత్ సబ్సిడీలో కోతపైనా వైఎస్ఆర్ సీపీ మండిపడుతోంది.

మరిన్ని వార్తలు