నయవంచన పాలనపై జనాగ్రహం

6 Nov, 2014 04:26 IST|Sakshi
నయవంచన పాలనపై జనాగ్రహం

* ‘జన్మభూమి- మా ఊరు’లో జిల్లాపై వరాల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
* రూ.4,500 కోట్లు వెచ్చించి ఏడాదిలోగా హంద్రీ-నీవా పూర్తిచేస్తానంటూ ప్రకటన
* బెంగళూరు-అనంతపురం-పలమనేరు-కుప్పం మధ్య రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తానని హామీ
* ప్రతి గ్రామంలోనూ పశువుల హాస్టల్, మిల్క్‌జిల్లాగా అభివృద్ధి చేస్తానని ప్రతిన
* తంబళ్లపల్లె నియోజకవర్గంలో రూ.50 కోట్లతో రోడ్లను నిర్మిస్తామని వాగ్దానం

సాక్షి,చిత్తూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను నిరసిస్తూ బుధవారం జిల్లాలో వైఎస్సార్ సీపీ కదం తొక్కింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయూల ఎదుట రైతులు,మహిళలు నిరసన గళం వినిపించారు.  ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. ఈ ఆందోళనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

పార్టీలకతీతంగా రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారులు స్వచ్ఛం దంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు.  చంద్రబాబు వంచ న పాలనపై దుమ్మెత్తి పోశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన బాబుకు పుట్టగతులుండవంటూ ధ్వజ మెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తహశీల్దారు కార్యాల యాల ఎదుట ఆందోళనలు కొనసాగాయి. రైతు, డ్వాక్రా రుణ మాఫీని తుంగలో తొక్కడంతో పాటు అర్హులైన వారి పింఛన్లలో కోతపెట్టడంపై నాయకులు మండిపడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి ఓట్లేయించుకుని ఏరుదాటాగ బోడిమల్లన్న అన్న సామెతగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
వైఎస్సార్ సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఆధ్వర్యంలో పుంగనూరులో  భారీ  నిరసన కార్యక్రమం జరి గింది. తిరుపతిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమ న కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు,  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగరిలో భారీ ర్యాలీ, ధర్నా జరిగింది. ఎమ్మెల్యే నారాయణస్వామి గంగాధరనెల్లూరు నియోజకవర్గం లోని పెనుమూరు, గంగాధరనెల్లూరులో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి, పలు మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో, సదుంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి పలమనేరు,పెద్దపంజాణి, బెరైడ్డిపల్లె తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ బంగారుపాళెం, తవణంపల్లెలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది.

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో  పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. చిత్తూరు తహశీల్దారు కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి  శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు సామాన్యకిరణ్, మహిళా నాయకురాలు గాయత్రీదేవి పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు