ఇంటింటికీ నవరత్నాలు

22 Sep, 2018 12:20 IST|Sakshi
ఒంగోలు 24వ డివిజన్‌లో నవరత్నాల గురించి వృద్ధులకు వివరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

‘రావాలి జగన్‌...కావాలి జగన్‌’కు అపూర్వ స్పందన

ప్రతి గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించిన నేతలు

వైఎస్సార్‌ సీపీపై అభిమానం చాటుతున్న ప్రజలు

ప్రకాశం, ఒంగోలు: రాజన్న బిడ్డను ఆశీర్వదిస్తే వృద్ధులకు నెలకు రెండు వేలు పింఛను ఇస్తాడు. పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని నిషేధించి అక్క,చెల్లెమ్మలకు అండగా ఉంటాడు.. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి చదివించే తల్లిదండ్రులకు ఆర్థిక చేయూతనిస్తాడు. కార్పొరేట్‌ వైద్యంతో ఆర్థిక భరోసానిస్తాడు.. ఇలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలను ఇంటింటికీ తిరుగుతూఒక్కొక్కటిగా ప్రజలకు వివరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమం జిల్లాలో ఐదో రోజు శుక్రవారం మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో సాగింది. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. వైఎస్సార్‌ సీపీపై ప్రజల్లో ఉన్న అభిమానం.. అధికార పార్టీతోపై ఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతోంది.  రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం శుక్రవారం జిల్లాలోని ముమ్మరంగా జరిగింది. ఒంగోలులో మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి 24వ డివిజన్‌లోని వడ్డెపాలెం, మంగలిపాలెంలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా డివిజన్‌లోని పార్వతమ్మ అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆయనకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి కొమరోలు మండలంలోని మొక్కుపల్లె, బెడిసెపల్లె గ్రామాలలో ప్రచారం ముమ్మరం చేశారు. కందుకూరులో మాజీమంత్రి మానుగుంట మహీధరరెడ్డి కందుకూరు పట్టణంలోని 2వ వార్డులోని జనార్దన్‌కాలనీలో నవరత్నాల పథకాల గురించి వివరించి కరపత్రాలు పంచారు. నవరత్నాలు పథకం ద్వారా ప్రయోజనాలను వివరించారు. పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి రామనాథంబాబు మార్టూరు మండలంలోని అంబేడ్కర్‌ కాలనీలో పర్యటించారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త టీజేఆర్‌ సుధాకర్‌బాబు మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలో మండల, గ్రామస్థాయి నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు.. చీరాల మండలం ఈపూరుపాలెం ఈసుబ్‌నగర్‌లో చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూధన్‌యాదవ్‌ కనిగిరి మండలంలోని దిరిశవంచ గ్రామంలో బూత్‌ కమిటీ కన్వీనర్లతో ఆయన రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య కొరిశపాడు మండలం మేదరమెట్లలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్షించారు. 

మరిన్ని వార్తలు