నవరత్నాలతో ప్రతి ఇంటికి ప్రయోజనం

21 Sep, 2018 12:16 IST|Sakshi
కడప: నవరత్నాల గూర్చి వివరిస్తున్న మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా

రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి కడప : వైఎఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజునుంచి నవరత్న పథకాల అమలుతో ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూరనుందని..వైఎస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పష్టం చేశారు.  గురువారం మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, అంజద్‌బాషా, పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జి  సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సమన్వయకర్తలు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, డాక్టర్‌ వెంకట సుబ్బయ్య  మాట్లాడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని వారు తేల్చి  చెప్పారు. 2019లో అధికారంలోకి రావడం తథ్యమన్నారు.

జిల్లాలోని అన్నిచోట్లా రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం ఊపందుకుంది.  పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.రైల్వేకోడూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఓబులవారిపల్లెలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఇంటింటికి తిరిగారు. ప్రతి ఒక్కరికి నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను అందజేస్తూ ముందుకు కదిలారు. వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కడపలోని 50వ డివిజన్‌లో రూకవారిపల్లె, పాలెంపల్లెలలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబులు ఇంటింటికి తిరుగుతూ వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. 

చంద్రబాబు మోసాలను వివరిస్తూ ముందుకు సాగారు.మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం ఇడమడకలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. ఇంటింటికి తిరుగుతూ అబద్ధాల చంద్రబాబును నమ్మవద్దని పిలుపునిచ్చారు. రాయచోటి పరిధిలోని గొర్లముదివీడు గ్రామ పరిధిలోని అరవవాండ్లపల్లె, బాలిరెడ్డిగారిపల్లె తదితర కుగ్రామాల్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పర్యటించారు.  బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడులో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్యలకు ఘన స్వాగతం లభించింది. ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల గురించి వివరించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం కర్మలవారిపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి రావాలి–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.

మరిన్ని వార్తలు