11న కాకినాడలో వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం

9 Mar, 2019 08:44 IST|Sakshi
రాజమహేంద్రవరంలో వైఎస్సార్‌ సీపీ ముఖ్యనేతలతో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, చిత్రంలో పిల్లి çసుభాష్‌ చంద్రబోస్, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, జక్కంపూడి రాజా తదితరులు

తూర్పుగోదావరి, దానవాయిపేట, (రాజమహేంద్రవరం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో 11వ తేదీ న (సోమవారం) కాకినాడలో వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరంలోని హోటల్‌ రివర్‌బేలో ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్,  కాకినాడ, రాజమహేంద్రవరం, పార్లమెంట్‌ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్‌ పలు నియోజవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో సోమవారం కాకినాడలో నిర్వహించనున్న   సమర శంఖారావం ఏర్పాట్లపై  చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చంద్రబాబు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సర్వేల పేరుతో సేకరించి ప్రైవేటు సంస్థకు అప్పగించారన్నారు. పౌరుల ఆధార్‌ నంబర్, బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు ఒక ప్రయివేట్‌ సంస్ధ అయిన ఐటీ గ్రిడ్‌ వద్ద లభించడం ప్రజల వ్యక్తిగత వివరాల చోరీయే అవుతుందని ధ్వజమెత్తారు. డేటా చౌర్యం బయటపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌కు భయం మొదలయిందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు దీన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని, సిట్‌ ఏర్పాటుతో టీడీపీ వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్,  పార్టీ రాష్ట్ర  ప్రోగాం కో అర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ మార్గాని భరత్, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, దవులూరి దొరబాబు, ఆకుల వీర్రాజు, పొన్నాడ సతీష్, జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు,  పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రీజినల్‌ పోలింగ్‌ బూత్‌ల కన్వీనర్‌ బి.వి.ఆర్‌ చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి సబెళ్ళ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో సభా ప్రాంగణ ప్రాంతాన్ని పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు