అమ్మకు పెద్ద కొడుకులా జగన్‌

18 Mar, 2019 16:00 IST|Sakshi

భరోసా కల్పిస్తున్న అమ్మ ఒడి పథకం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే ఆలోచన

సాక్షి, మొగల్తూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల్లో అమ్మ ఒడి పథకం ఒకటి. భూమిలేని నిరుపేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు పిల్లల చదువులకు ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు నుండి రూ.15వేలు వారి తల్లులకే ఇవ్వడం అమోఘమైన పథకమని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం కార్పొరేట్‌ శక్తులకు ఊతమిచ్చేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పేదవాడు పిల్లలకు వేలకు వేలు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారని వారికి చేయూత అందించి, ప్రభుత్వ విద్యావ్యవస్థకు ప్రజలకు నమ్మకం కలిగించేలా జగన్‌ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్నత చదువులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా మూలనపడేశారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌ పధకంలో ఎంతో మంది చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగారు. అలాంటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు  నీరు గార్చారు. ఇప్పటికీ కాలేజీలకు నిధులు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మూలన పడేసి పోలవరానికి ప్రత్యేక బస్సులంటూ ప్రచార ఆర్భాటం చేశారని మండిపడుతున్నారు. తండ్రిలాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి అని మహిళలు విశ్వసిస్తున్నారు. 

పథకం వివరాలు

  •  పిల్లలను బడికి పంపితే ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు నుంచి రూ.15 వేలు లబ్ధి
  •  1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలకు రూ.500లు చొప్పున ఇద్దరికి రూ.1000లు నెలనెలా వారి తల్లులకే చేతికే ఇవ్వడం
  •  6 నుండి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు రూ750 చొప్పున ఇద్దరికి రూ1500 నెలనెలా  వారి తల్లుల చేతికే ఇవ్వడం
  •  ఇంటర్‌ చదివే పిల్లలకు రూ.1000లు చొప్పున ఇద్దరికి రూ.2000లు చొప్పున నెలనెలా వారి తల్లులకే అందివ్వడం.

మాలాంటి వాళ్లకు ఎంతో ఉపయోగం
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మ ఒడి పథకం మాలాంటి వాళ్ళకు ఎంతోగానో ఉపయోగ పడుతుంది. ప్రతీ నెలా విద్యార్థుల తల్లులకు నేరుగా డబ్బు ఇస్తానని ప్రకటించడం ఆయనకు పేదల పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనం.
– వేగి లక్ష్మి, మొగల్తూరు

వైఎస్సార్‌ పునర్జన్మనిచ్చారు
చిన్న వయస్సులోనే పొట్టలో నరాలు తెగిపోవడంతో ఆరోగ్య శ్రీలో ఆపరేషన్‌ చేశారు. 2009 మే 6న గుంటూరు లీలావతి ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించుకున్నాను. నా తల్లికి ఆపరేషన్‌ చేసిన సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించే కత్తెర నా కడుపులో దిగి నరాలు కోసుకుపోయాయి. నేను ఇప్పుడు మొగల్తూరులో నాలుగోతరగతి చదువుతున్నాను. 
– రావి రోనాల్డ్‌ రోజ్, పిట్టావారిపేట, రామన్నపాలెం  


జగన్‌ అధికారంలోకి రావాలి
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆయన తనయుడు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం అమలు కావాలంటే ఆయన అధికారంలోకి రావాలి.
– నల్లి రాజేశ్వరి,మొగల్తూరు


బాబు మాటలు మళ్లీ నమ్మం
బాబు మాటలు విని గతంలో మోసపోయాం. మరోసారి ఎన్నికలు వస్తున్నా బాబు మాటలు మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితి లేదు. అధికారంలోకి రాకముందు ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడే బాబును ఎవరూ నమ్మరు.
– విల్లూరి లత,మొగల్తూరు 

మరిన్ని వార్తలు