వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు నారాయణరెడ్డి మృతి

28 Oct, 2015 14:08 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ఖాదీ పరిశ్రమల బోర్డు మాజీ డెరైక్టర్, వైఎస్‌ఆర్ సీపీ సీనియర్ నాయకుడు దొంతిరెడ్డి నారాయణరెడ్డి(65) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడుకు చెందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. నారాయణరెడ్డి...మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సన్నిహితుడిగా మెలిగేవారు. నారాయణరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు