కువైట్‌లో ప్రవాస భారతీయులకు వైఎస్‌ఆర్‌సీపీ సేవలు

12 Feb, 2018 12:17 IST|Sakshi

కడప కార్పొరేషన్‌: కువైట్‌లోని ప్రవాస భారతీయులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ– కువైట్‌  ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్, కువైట్‌ కన్వీనర్‌ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. కువైట్‌లో ఏడు సంవత్సరాల తర్వాత అక్కడి ప్రభుత్వం రెసిడెన్సీ(అకామా), పాస్‌పోర్టు లేని విదేశీయులకు క్షమాభిక్ష ప్రసాదించిందన్నారు.  ఈ మేరకు భారతీయ రాయబార కార్యాలయం వద్ద ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5   వరకు  ప్రవాస భారతీయులకు అన్నం, నీళ్ల బాటిళ్లు అందించనున్నట్లు చెప్పారు.  అకామా, పాస్‌పోర్టు లేనివారికి క్షమాభిక్ష ప్రసాదించడమేగాక, 22.2.18వరకూ వెళ్లిపోయిన వారు మళ్లీ తిరిగి కువైట్‌కు వచ్చే అవకాశాన్ని కల్పించిన కువైట్‌ దేశ రాజుకు తెలుగు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ పి. రెహమాన్‌ఖాన్, కోశాధికారి ఎన్‌. మహేశ్వర్‌రెడ్డి, మర్రి కళ్యాణ్, రమణ యాదవ్, బీఎన్‌ సింహ, అబుతురాబ్, షా హుస్సేన్, గోవిందు రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు