వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు పెద్దపీట

28 Aug, 2014 02:12 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు పెద్దపీట

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు ముఖ్య పదవులు లభించాయి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా చిన వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. ఎస్సీ సెల్ అధ్యక్షునిగా మేరుగ నాగార్జున, ప్రధాన కార్యదర్శులుగా కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి బాధ్యతలతోపాటు ప్రకాశం జిల్లా వ్యవహారాలను, మోపిదేవి వెంకట రమణ కృష్ణా, గుంటూరు జిల్లాలు.. జంగా కృష్ణమూర్తి  వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పార్టీ వ్యవహారాలను చూస్తారు. ఇదిలా ఉండగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి నియమితులయ్యారు.
 

మరిన్ని వార్తలు