సంక్షోభంలో గోదావరి డెల్టా!: నాగిరెడ్డి

29 Dec, 2015 13:46 IST|Sakshi

రాజమండ్రి: వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు నాయకుడు నాగిరెడ్డి మండిపడ్డారు. ఖరీఫ్లో దిగుబడి 80లక్షల నుంచి 50లక్షలకు పడిపోయిందని తెలిపారు.

'ప్రభుత్వ తీరుతో గోదావరి డెల్టా సంక్షోభంలో పడుతుంది. పోలవరం రాకుంటే ఖరీఫ్లో ఒక్క ఎకరాకు నీరిచ్చే పరిస్థితి లేదు. రైతు సంఘాలతో చంద్రబాబు మాట్లాడలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఇప్పటి వరకు అమలు చేయలేదు. 2009లో గోదావరి డెల్టాకు దారుణమైన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ చాకచక్యంగా వ్యవహరించి ఒక్క ఎకరా ఎండిపోకుండా నీరిచ్చారు. అదే విధానాన్ని బాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు' అని నాగిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు