భగ్గుమన్న యువత

21 Sep, 2019 05:28 IST|Sakshi

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి)/పలమనేరు/వికోట/గుంతకల్లు: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ప్రశ్నపత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన కథనం పట్ల రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాలు ఆ పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కథనాన్ని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు తిరుపతి ఎస్వీయూలో ఆ పత్రిక దినపత్రికను తగలబెట్టారు. విద్యార్థి విభాగం నేతలు మురళీధర్, కిషోర్‌దాస్, నరేంద్ర, శివకృష్ణ, తదితరులు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికను, ఏబీఎన్‌ చానెల్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

గ్రామ సచివాలయ పరీక్షలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీఎన్‌ నాగరాజు చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోటలో వేర్వేరుగా డిమాండ్‌ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికను దహనం చేసి నినాదాలు చేశారు. ర్యాంకులు సాధించిన వారిపై అసత్య కథనాలు వెలువరించిన రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని రాయలసీమ విమోచన సమితి నేతలు డిమాండ్‌ చేశారు.  గుంతకల్లు హనుమాన్‌ సర్కిల్‌లో నిరసన తెలిపారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా