పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు

29 Jun, 2014 20:13 IST|Sakshi
పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయనుంది. పార్టీ అధ్యక్షుడి సంతకాలతో కూడిన లేఖలను ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు పార్టీ కార్యాలయం పంపనుంది. పార్టీ విప్ ధిక్కరించిన వారిపై అనర్హత వేటు పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసేందుకు అనుమతి కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే లేఖ రాసింది.

జూలై 3న మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికలు, 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. 5వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఎన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తుండటంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హతకు గురవుతారు.

మరిన్ని వార్తలు