‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’

19 Mar, 2017 13:23 IST|Sakshi
‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’

కడప: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 17న ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

మరిన్ని వార్తలు