వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం: సజ్జల

14 May, 2019 13:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు రోజుకో స్టేట్‌మెంట్‌తో భ్రమ కల్పిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సజ్జల మాట్లాడుతూ..'కొన ఊపిరితో కొట్టుకుంటున్న టీడీపీ పార్టీని చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని సీట్లో చెప్పకుండానే అధికారంలోకి వస్తామని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చేసింది తప్పని ఫలితాల తర్వాత ఒప్పుకోవాల్సి వస్తుంది. సర్వేలు తమకే అనుకూలమని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేయడం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి.

చంద్రబాబు తీరుపై అందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జాతీయ నేతలను కలిసి ఫోటోలు మాత్రమే తీసుకోగలిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జాతీయ రాజకీయాల్లో కూడా వైఎస్‌ జగన్‌ కీలకపాత్ర పోషిస్తారు. ఏనాడైనా కరువుపైనా, మంచినీటి సమస్యలపైనా చంద్రబాబు కేబినెట్‌ నిర్వహించారా? ఇప్పుడు పెడుతున్న కేబినెట్‌ భేటీకి ప్రాధాన్యత ఏముంది? ఫలితాలు వచ్చే కొద్ది రోజుల ముందు కేబినెట్‌ మీటింగ్‌ ఎందుకు? ఇది చంద్రబాబు చివరి కేబినెట్‌ కాబోతోంది. ఈనెల 23 తర్వాత ఉత్కంఠకు తెరపడుతుంది' అని పేర్కొన్నారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
ఈ ఎన్నికలతో టీడీపీ కథ ముగిసినట్లే

మరిన్ని వార్తలు