స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే

3 Mar, 2017 03:21 IST|Sakshi
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే

వైవీ సుబ్బారెడ్డి ధీమా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో నెల్లూరు టీడీపీ నేతల చేరిక
సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల నుంచి ఏపీ శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు గురువారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైవీ మీడియాతో మాట్లాడారు. టీడీపీ పరిపాలనలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు కావస్తున్నా ప్రజలకు ఒక్క పనీ చేయలేకపోతున్నామనే  స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
 

మరిన్ని వార్తలు