యువశక్తే భారత్ సూపర్‌పవర్

27 Jan, 2015 01:11 IST|Sakshi
యువశక్తే భారత్ సూపర్‌పవర్

ఏఎన్‌యూ: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ తదితర సాంకేతిక రంగాల్లో 40 శాతం భారత యువకులు అగ్రస్థానాల్లో ఉన్నారని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె వియ్యన్నారావు చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో వీసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న యువత మేథస్సును దేశాభివృద్ధి కోసం వినియోగించాలన్నారు.

దేశంలో 60 శాతం ఉన్న యువ సంసదను సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో భారత్ మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ ధర్ మాట్లాడుతూ ప్రధాన మోడీ దూర దృష్టితో దేశాభివృద్దికి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్, గణతంత్ర దిన వేడుకల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి సిద్దయ్య, ఆర్ట్స్, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ ఆచార్య వి చంద్రశేఖర్, ఆచార్య బి విక్టర్‌బాబు, డాక్టర్ పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య ఏ ప్రమీలారాణి ప్రసంగించారు. అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ఈ సందర్బంగా ఏఎన్‌యూ క్రీడా మైదానంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏఎన్‌యూ ఆర్ట్స్, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విభాగాలు, ఏఎన్‌యూ రవాణా విభాగం, అనుబంధ కళాశాలలు వివిధ అంశాలపై శకటాలను ప్రదర్శించాయి. ఉత్తమ శకటాలకు వీసీ వియ్యన్నారావు బహుమతులు అందజేశారు.

మరిన్ని వార్తలు