ప్రాజెక్టులతో ఏపీకి రండి సహకారమందిస్తాం

14 Oct, 2019 09:38 IST|Sakshi
సింగపూర్‌లో తెలుగువారితో సమావేశమైన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సింగపూర్‌లో ఎన్‌ఆర్‌ఐలకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిలుపు

సాక్షి, తిరుమల: ఎన్‌ఆర్‌ఐలు ఉద్యోగాలు కల్పించేలా ప్రాజెక్టులతో ఏపీకి రావాలని ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం సింగపూర్‌లో జరిగిన శ్రీనివాస కల్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు వైవీ సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. మౌలిక సదుపాయాలు, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలియజేశారు.

రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి దోహదపడుతుందన్నారు. ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్రం వెనుకబడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో గాని తమ గ్రామాల్లో గాని ఏ సమస్య అయినా ఉందని చెబితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని ఆయన భరోసానిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌ డి.ప్రకాష్‌రెడ్డి, సభ్యులు మహేష్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్య, నాగరాజు, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్జనపై మక్కువ.. సేవలు తక్కువ

సెస్సు.. లెస్సు!

జాలి లేని దేవుడు! 

ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య

ఏపీఎస్‌ ఆర్టీసీకి దసరా ధమాకా

పారదర్శక పాలనలో మరో ముందడుగు

నామినేషన్‌పై మందుల కొను‘గోల్‌మాల్‌’

ఒకేసారి 1,448 ఆలయాలకు..పాలక మండళ్లు

నేడు వ్యవసాయ మిషన్‌ సమావేశం

సీఎం జగన్‌తో నేడు చిరంజీవి భేటీ

సీఎం జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి

పెరటాసి నెల చివరి వారం.. తిరుమల కిటకిట

బాబు కట్టు కథలు చెప్పించారు : ఉమ్మారెడ్డి

‘వైఎస్సార్‌ రైతు భరోసా’కు సర్వం సిద్ధం

రైతు భరోసాకు రూ. 5,510 కోట్లు విడుదల

సీఎం జగన్‌ను కలిసిన పలువురు ఎంపీలు

‘అర్హులైన రైతులందరికీ భరోసా’

ఈనాటి ముఖ్యాంశాలు

‘అందుకే చంద్రబాబు భయపడుతున్నారు’

పారదర్శక పాలనలో సీఎం జగన్‌ మరో అడుగు

‘రాయితీ సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారు’

అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు

‘బీసీలకు శాశ్వత కమిషన్‌ వేసింది ఏపీ ఒక్కటే’

‘దేశంలోనే రెండో అతిపెద్ద డ్వాక్రా బజారు’

వివేకా హత్య కేసులో పుకార్లను నమ్మొద్దు : ఎస్పీ 

ఏపీలో ఘనంగా వాల్మీకీ జయంతి వేడుకలు

ఇంటికి తాళం.. ఎల్‌హెచ్‌ఎంఎస్‌దే భారం..!

ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు

లోయలో పడిన ఫైరింజన్‌; సిబ్బందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’

అందం కోసం మాతృగడ్డలో చికిత్స ..

మళ్లీ హిమాలయాలకు రజనీ

వనవాసం రెడీ

సినిమా నిర్మించానని తిట్టారు

అందుకే వారు గొప్ప నటులయ్యారు