ట్రయల్‌ రన్‌ పూర్తయ్యాక భక్తులకు శ్రీవారి దర్శనం

4 Jun, 2020 04:25 IST|Sakshi

టీటీడీ  చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
► ఈ నెల 8వ తేదీ నుంచి స్వామివారి దర్శనానికి సంబంధించి టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, పాలక మండలి సభ్యులతో మూడు రోజుల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నాం. దీని ద్వారా ఒక్క రోజులో ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించగలమనే అంచనా వేస్తాం.  
► క్యూలైన్‌లలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం.  
► ఆన్‌లైన్‌ బుకింగ్‌తోనే సర్వదర్శనం లేదా టికెట్‌ దర్శనానికి అనుమతి.  
► ఆన్‌లైన్‌ బుకింగ్‌పై అవగాహనకు అలిపిరి గేట్‌ దగ్గర రిజిస్ట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే టెస్టులు చేసి దర్శనానికి అనుమతిస్తాం.  
► కోనేటి స్నానానికి అనుమతి లేదు. ప్రత్యేకంగా ట్యాప్‌లు ఏర్పాటు చేశాం.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా