స్వయం ఉపాధి సున్నా!

4 Feb, 2014 00:42 IST|Sakshi
స్వయం ఉపాధి సున్నా!
  •     రుణాల మంజూరుకు రెండు నెలలే గడువు
  •      ముంచుకొస్తున్న ఎన్నికల కోడ్
  •      దరఖాస్తుదారుల్లో ఆందోళన
  •   త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది...అభివృద్ధి పనులకు ‘కోడ్’ అడ్డం రానుంది. ఇదే సమయంలో మరో రెండు నెలల్లోనే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో స్వయం ఉపాధి రుణాలు లబ్ధిదారులకు అందే సూచనలు కన్పించడం లేదు.  ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ఆలస్యంగా ఖరారు చేయడంతో రాష్ట్రంలో ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది.
     
    విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు రుణాలు అందే సూచనలు కనిపించడం లేదు.  సబ్సిడీ మొత్తాలు పెంచడంతో ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ వెనక్కి పంపేశారు.  వివరాలిలా వున్నాయి. ఏటా బీసీ,ఎస్సీ,మైనారిటీ,సెట్విస్ సం స్థల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రూ.కోట్లతో రుణాలు ఇస్తుంటారు.

    ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేశాక బ్యాంకులు రుణాలు ఇస్తాయి. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలో పావలా మినహాయించుకుని మిగిలిన వడ్డీని వాపస్ చేస్తారు. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను గత నెలలో ఖరారు చేయడం గమనార్హం. ఈ ఏడాది సబ్సిడీ మొత్తాలను రూ.30వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అలాగే, లబ్ధిదారుని వాటా ధనం రద్దు చేశారు.

    గతనెలలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అధికారులతో కూడిన క మిటీ ఆమోదించిన దరఖాస్తులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. రుణాలకు వయోపరిమితిని బీసీలకు 40 ఏళ్లు, ఎస్సీలకు 45 ఏళ్లకు కుదించారు.  వెనక్కి వచ్చిన దరఖాస్తులు ఎండీఓ, జీవీఎంసీ జోనల్, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయాలలో మూలుగుతున్నాయి. దరఖాస్తులను మళ్లీ పరిశీలించి ప్రభుత్వానికి పంపేసరికి సార్వత్రిక ఎన్నికల కోడ్ ముంచు కొచ్చేస్తుందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.  
     
     వివిధ శాఖల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి...
     
     ఎస్సీ కార్పొరేషన్‌లో...
     ఈ ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన దరఖాస్తులు 8012
     
     బ్యాంకర్ల ఆమోదంతో వచ్చిన దరఖాస్తులు 343
     
     ఈ ఏడాది లక్ష్యం 1495 యూనిట్లు
     
     వార్షిక రుణ లక్ష్యం రూ.13.55కోట్లు
     
     సబ్సిడీ రూ.6.01కోట్లు
     
     బ్యాంకు రుణాలు రూ.7.54కోట్లు
     
     జీవీఎంసీ పరిధిలో 608 యూనిట్లకు 2340 దరఖాస్తులు
     
     గ్రామీణ ప్రాంతాలలో 140 యూనిట్లకు 885 దరఖాస్తులు
     
     నర్సీపట్నంలో 409 యూనిట్లకు 2732 దరఖాస్తులు
     
     యలమంచిలిలో 9 యూనిట్లకు 158 దరఖాస్తులు
     
     బీసీ కార్పొరేషన్‌లో...
     వార్షిక రుణ లక్ష్యం రూ.34.49కోట్లు
     
     మార్జిన్‌మనీ రుణాలకు రూ.21.06కోట్లు
     
     రాజీవ్ అభ్యుదయ యోజనకు రూ.13.43కోట్లు
     
     మార్జిన్‌మనీ దరఖాస్తులు 1172
     
     రాజీవ్‌రుణాల దరఖాస్తులు 413
     
     సెట్విస్‌లో...
     ఈ ఏడాది యూనిట్ల లక్ష్యం 610 యూనిట్లు
     
     రుణాల లక్ష్యం రూ.6.10కోట్లు
     
     వచ్చిన దరఖాస్తులు 930కిపైగా
     
     సబ్సిడీ మొత్తం రూ.2కోట్లు
     
     బ్యాంక్ రుణం రూ.4.10కోట్లు
     
     5- బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ
     

మరిన్ని వార్తలు