గ్రహం అనుగ్రహం 01-03-2020

1 Mar, 2020 05:30 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.షష్ఠి ఉ.7.11 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం కృత్తిక తె.4.51 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి రోహిణి, వర్జ్యం సా.4.01 నుంచి 5.43 వరకు, దుర్ముహూర్తం సా.4.29 నుంచి 5.14 వరకు, అమృతఘడియలు... రా.2.13 నుంచి 3.42 వరకు.

సూర్యోదయం        :  6.22
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమార్పులు.
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. 
మిథునం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
కర్కాటకం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
సింహం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కన్య: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.
తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: మిత్రులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
ధనుస్సు: సన్నిహితుల నుంచి ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం: ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మీనం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు