గ్రహం అనుగ్రహం (02-01-2020)

2 Jan, 2020 05:59 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి శు.సప్తమి రా.6.51 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం ఉత్తరాభాద్ర తె.5.46 వరకు (తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ఉ.9.22 నుంచి 11.10 వరకు, దుర్ముహూర్తం ఉ.10.13 నుంచి 10.57 వరకు, తదుపరి ప.2.36 నుంచి 3.20 వరకు అమృతఘడియలు... రా.12.26 నుంచి 2.13 వరకు.

సూర్యోదయం :    6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. స్థిరాస్తి ఒప్పందాలు. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

తుల: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ధన, వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: పనులలో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మకరం: సోదరులు, మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు