గ్రహం అనుగ్రహం (02-07-2020)

2 Jul, 2020 06:37 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.ద్వాదశి ప.2.46 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం అనూరాధ రా.1.21 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం ఉ.6.25 నుంచి 7.56 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.46 వరకు, తదుపరి ప.3.05 నుంచి 3.56 వరకు అమృతఘడియలు... ప.3.36 నుంచి 4.44 వరకు.

సూర్యోదయం :   5.32
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు   

దిన ఫలాలు (గురువారం, 02-7-20)

మేషం..
పనుల్లో తీవ్ర జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.  ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

వృషభం..
కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలలో మెరుగుదల. పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలమవుతాయి.

మిథునం..
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల పరిచయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

కర్కాటకం..
పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులలో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

సింహం..
చేపట్టిన పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత చికాకులు.

కన్య..
కొత్త పనులు చేపడతారు. ఊహించని ధనలాభం. దూరపు బం«ధువుల కలయిక. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల..
బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం..
శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సు..
వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగ మార్పులు.

మకరం..
కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం..
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం..
చిత్రమైన సంఘటనలు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

>
మరిన్ని వార్తలు