గ్రహం అనుగ్రహం (04-02-2020)

4 Feb, 2020 06:21 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి శు.దశమి సా.5.50 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం రోహిణి రా.10.28 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ప.2.06 నుంచి 3.47 వరకు, తిరిగి తె.4.12 నుంచి 5.50 వరకు, దుర్ముహూర్తం ఉ.8.51 నుంచి 9.34 వరకు, తదుపరి రా.10.56 నుంచి 11.47వరకు, అమృతఘడియలు... రా.7.09 నుంచి 8.44 వరకు.

సూర్యోదయం :    6.35
సూర్యాస్తమయం    :  5.54
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్లు. ఆస్తుల వివాదాలు.

వృషభం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.విందువినోదాలు.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మీ కష్టం ఫలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం: ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు ^è ర్చిస్తారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

కన్య: కొత్తగా అప్పులు చేస్తారు. మానసిక అశాంతి. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలతో భారంగా మారతాయి. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ధననష్టం.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం.

వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.

ధనుస్సు: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.గృహయోగం.

మకరం: రాబడికి మించి ఖర్చులు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. మానసికఆందోళన. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్యసమస్యలు.

కుంభం: అంచనాలు తప్పుతాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగవు.

మీనం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు