గ్రహం అనుగ్రహం (04-03-2020)

4 Mar, 2020 04:42 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.నవమి ఉ.8.47 వరకు తదుపరి దశమి, నక్షత్రం మృగశిర ఉ.6.47 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం ప.3.14 నుంచి 4.53 వరకు, దుర్ముహూర్తం ప.11.47 నుంచి 12.32 వరకు అమృతఘడియలు... రా.8.54 నుంచి 10.29 వరకు.

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం :  6.02
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు∙నిజమవుతాయి.

వృషభం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యవహారాలలో క్రియాశీల పాత్ర. కొత్త పనులు చేపడతారు ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
 

కర్కాటకం: ఆస్తి వివాదాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కన్య: శుభకార్యాల ప్రస్తావన. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. సోదరులు, మిత్రులతో సఖ్యత. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. సోదరులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిష్ఠంభన. నిర్ణయాలు మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

కుంభం: వ్యవహారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు న త్తనడకన సాగుతాయి.

– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు