గ్రహం అనుగ్రహం (04-11-2019)

4 Nov, 2019 06:20 IST|Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. కార్తీక మాసం. తిథి శు.అష్టమి పూర్తి (24 గంటలు). నక్షత్రం శ్రవణం తె.5.28 వరకు (తెల్లవారితే మంగళవారం). వర్జ్యం ఉ.8.01 నుంచి 9.44 వరకు. దుర్ముహూర్తం ప.12.06 నుంచి 12.54 వరకు, తదుపరి ప.2.23 నుంచి 3.10 వరకు. అమృత ఘడియలు సా.6.20 నుంచి 8.01 వరకుసూర్యోదయం: 6.04 సూర్యాస్తమయం : 5.26రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: విద్యార్థులకు మాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

మిథునం: పనులు మధ్యలో విరమిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

సింహం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.

కన్య: పనులలో ఆటంకాలు. రుణాలు మరింత చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు