గ్రహం అనుగ్రహం(04-12-2019)

4 Dec, 2019 06:26 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.అష్టమి రా.12.52 వరకుతదుపరి నవమి, నక్షత్రం శతభిషం సా.5.14 వరకుతదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.12.19 నుంచి 2.07 వరకుదుర్ముహూర్తం ఉ.11.26 నుంచి 12.10 వరకుఅమృతఘడియలు... ఉ.9.20 నుంచి 11.19 వరకు.

సూర్యోదయం :    6.19
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం:    పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

తుల: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులను కలుసుకుంటారు. అనారోగ్యం. ఖర్చులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మకరం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనుకోని ప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

కుంభం: సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు