గ్రహం అనుగ్రహం (06-07-2020)

6 Jul, 2020 06:19 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఆషాఢ మాసం. తిథి బ.పాడ్యమి ఉ.9.15 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఉత్తరాషాఢ రా.11.47 వరకు, తదుపరి శ్రవణం. వర్జ్యం ఉ.7.40 నుంచి 9.16 వరకు. తిరిగి తె.4.05 నుంచి 5.40 వరకు (తెల్లవారితే మంగళవారం). దుర్ముహూర్తం ప. 12.31 నుంచి 1.23 వరకు, తిరిగి ప.3.07 నుంచి 4.00 వరకు. అమృత ఘడియలు సా. 5.27 నుంచి 7.03 వరకు సూర్యోదయం: 5.34 సూర్యాస్తమయం: 6.35; రాహుకాలం:  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

గ్రహఫలం
మేషం: పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. కార్యజయం.   వ్యాపారాలలో లాభాలు  అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు.

వృషభం: కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. ఆస్తి వివాదాలు. రాబడి కన్నా ఖర్చులు అధికం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో అనుకోని పనిభారం.

మిథునం: రాబడి అంతగా కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయంలో సోదరులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  ఆటుపోట్లు. ఉద్యోగాలు భారంగా సాగుతాయి. 

కర్కాటకం: ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు.విలువైన వస్తువులు కొంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. 

సింహం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి.

కన్య: అనుకోని ప్రయాణాలు. రాబడి కొంత మందగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం. వ్యాపారాలలో నిరాశ.
ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. 

తుల: రాబడి అంతగా అనుకూలించదు. బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాల్లో చికాకులు. 

వృశ్చికం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు.

మకరం: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. 

కుంభం: ఆర్థికంగా కొంత ఇబ్బందులు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆధ్యాత్మిక  చింతన. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: రాబడి సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సçహాయపడతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా