గ్రహం అనుగ్రహం (07-10-2019)

7 Oct, 2019 07:25 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. ఆశ్వయుజ మాసం. తిథి శు.నవమి ప.2.51 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ఉత్తరాషాఢ రా.8.25 వరకు, తదుపరి శ్రవణం. వర్జ్యం రా.12.42 నుంచి 2.24 వరకు. దుర్ముహూర్తం ప.12.10 నుంచి 12.57 వరకు, తదుపరి ప.2.22 నుంచి 3.21 వరకు. అమృత ఘడియలు రా.1.34 నుంచి 3.12 వరకు.

సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.42; మహార్నవమి
రాహుకాలం : ఉ.7.30 నుంచి  9.00 వరకు;
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగ,వ్యాపారాలలో పురోగతి.

వృషభం: విద్య, ఉద్యోగ.ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

మిథునం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు. వాహనాలు, గృహం కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి.

కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

తుల: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు.

వృశ్చికం: చేపట్టిన పనులలో పురోగతి. సంఘంలో గౌరవమర్యాదలు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య నిర్ణయాలు. నూతన  కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత.

ధనుస్సు: పనుల్లో కొంత జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహార విజయం. శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఉద్యోగ,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు