గ్రహం అనుగ్రహం (08-10-2019)

9 Oct, 2019 17:18 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం,తిథి శు.అష్టమి ప.2.10 వరకు, తదుపరి నవమి ,నక్షత్రం పూర్వాషాఢ రా.7.02 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రా.3.29 నుంచి 5.17 వరకు, దుర్ముహూర్తం సా.4.09 నుంచి 5.55 వరకు, అమృతఘడియలు..ప.2.01 నుంచి 3.44 వరకు. (దుర్గాష్టమి)

సూర్యోదయం        :  5.54
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు


మేషం : సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం : ధనవ్యయం. కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం : పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కర్కాటకం : కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం : ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య : శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు అధికం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు.

తుల : కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యభంగం. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

వృశ్చికం : విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. అరుదైన సన్మానాలు. వాహనయోగం. ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు.

ధనుస్సు : పనులలో కొద్దిపాటి ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార, ఉద్యోగాలలోæ మార్పులు.

మకరం : పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విద్యావకాశాలు దక్కుతాయి. 

కుంభం : ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది.  అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు కొంత గందరగోళంగా సాగుతాయి.

మీనం : నూతన వ్యక్తుల పరిచయం. నూతన ఉద్యోగావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
 

>
మరిన్ని వార్తలు