గ్రహం అనుగ్రహం (09-01-2020)

9 Jan, 2020 06:30 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.చతుర్దశి రా.2.07 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం మృగశిర ప.3.20 వరకు, తదుపరి ఆరుద్రవర్జ్యం రా.11.43 నుంచి 1.16 వరకు, దుర్ముహూర్తం ఉ.10.16 నుంచి 11.00 వరకు, తదుపరి ప.2.40 నుంచి 3.26 వరకుఅమృతఘడియలు... ఉ.6.21 నుంచి 7.56 వరకు.

సూర్యోదయం :    6.37
సూర్యాస్తమయం    :  5.37
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు.

వృషభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం:  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. బంధువులతో వివాదాలు తీరతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహం:  చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య:  ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: సోదరులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వైద్యసేవలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

వృశ్చికం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

దనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో సమస్యలు.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు