గ్రహం అనుగ్రహం 09-07-2019

9 Jul, 2019 07:54 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢమాసం 
తిథి శు.సప్తమి ఉ.9.21 వరకు
తదుపరి అష్టమి, నక్షత్రం హస్త రా.9.33 వరకు
తదుపరి చిత్త, వర్జ్యం ఉ.6.54, నుంచి 8.25 వరకు 
తదుపరి తె.5.07 నుంచి 6.38 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం ఉ.8.09 నుంచి 9.01, వరకు 
తదుపరి రా.10.56 నుంచి 11.40 వరకు
అమృతఘడియలు... ప.3.55 నుంచి 5.22 వరకు.

సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం :  6.32
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. విద్యార్థులకు నూతనోత్సాహం. కొన్ని వివాదాల పరిష్కారం.

వృషభం: అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ప్రతిష్ఠంభన. అనారోగ్యం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. దైవదర్శనాలు.

మిథునం: బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో కొద్దిపాటి  ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఆలయ దర్శనాలు. శ్రమ మరింత పెరుగుతుంది.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు

సింహం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆస్తి వివాదాలతో కొంత ఇబ్బందిపడతారు. దైవచింతన .

కన్య: నూతన వరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి.

తుల: పనుల్లో స్వల్ప అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.  స్వల్ప ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం.

వృశ్చికం: చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. తీర్థయాత్రలు. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

ధనుస్సు: విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. సమస్యలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: కుటుంబసభ్యులతో కొన్ని  వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. వృత్తి, వ్యాపారాలు భారంగా మారతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వైరం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. కొద్దిపాటి ఆరోగ్య, కుటుంబసమస్యలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు సాయం అందిస్తారు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు