గ్రహం అనుగ్రహం (10-02-2020)

10 Feb, 2020 06:18 IST|Sakshi

శ్రీవికారి నామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. మాఘ మాసం. తిథి బ.పాడ్యమి ఉ.11.44 వరకు, తదుపరి విదియ. నక్షత్రం మఖ రా.7.34 వరకు, తదుపరి పుబ్బ. వర్జ్యం ఉ.8.13 నుంచి 9.44 వరకు, తిరిగి రా.3.04 నుంచి 4.33 వరకు. దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.23 వరకు. తదుపరి ప.2.54 నుంచి 3.37 వరకు. అమృత ఘడియలు సా.5.14 నుంచి 6.44 వరకు; సూర్యోదయం: 6.34 సూర్యాస్తమయం: 5.55; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. మిత్రులతో  విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కర్కాటకం: అనుకోని ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు.  వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు. ఆలయ దర్శనాలు. పనులు ముందుకు సాగవు.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. వాహనయోగం.  వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: ఇంటాబయటా సమస్యలు.  శ్రమా«ధిక్యం. స్వల్ప అనారోగ్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు.  మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.

తుల: మీ ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారవృద్ధి. వస్తు, వస్త్రలాభాలు.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

మకరం:  వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. వృథా ఖర్చులు.

కుంభం: ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు హోదాలు. శుభవార్తలు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు