గ్రహం అనుగ్రహం (10-07-2020)

10 Jul, 2020 06:21 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, తిథి బ.పంచమి ఉ.11.07 వరకు, తదుపరి షష్ఠినక్షత్రం పూర్వాభాద్ర పూర్తి, వర్జ్యం ఉ.10.31 నుంచి 12.15 వరకు, దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.05 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.22 వరకు, అమృతఘడియలు... రా.8.58 నుంచి 10.43 వరకు.

సూర్యోదయం :    5.35
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం: ఉద్యోగయత్నాలు సానుకూలం.  ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు కాస్త ఊరట.

వృషభం:ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు.  భూవివాదాల నుంచి బయటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. అదనపు ఆదాయం చేకూరుతుంది.వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

మిథునం: అనుకోని ప్రయాణాలు సంభవం. ఉద్యోగ, వివాహయత్నాలు నిరాశ కలిగిస్తాయి.బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. రాబడి తగ్గి రుణాలు చేస్తారు. వ్యాపారులకు ఒడిదుడుకులు,  ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం: కుటుంబసమస్యలు. ఆదాయం తగ్గుతుంది. బంధుగణంతో అకారణ వైరం. వాహనాలు,ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారులు కొంత నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో అదనపు పనిభారం.

సింహం: బంధువుల నుంచి సహాయం అందుతుంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాల్లో శుభవార్తలు.

కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు రాబడి. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

తుల:ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో విరోధాలు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.

వృశ్చికం: ఆదాయం అంతగా కనిపించదు. శ్రమానంతరం పనులు పూర్తి. అనుకోని ప్రయాణాలు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ఉద్యోగులకు శ్రమపెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు:వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారులుఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు రాగలవు.

మకరం:ఆదాయం తగ్గుతుంది. బంధుగణంతో వివాదాలు.  ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

కుంభం:చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారుల లక్షా్యలు సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

మీనం:కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువర్గంతో ముఖ్యవిషయాలపై చర్చిస్తారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

మరిన్ని వార్తలు