గ్రహం అనుగ్రహం (11-07-2020)

11 Jul, 2020 06:42 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.షష్ఠి ప.12.44 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం పూర్వాభాద్ర ఉ.5.43 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం సా.4.15 నుంచి 6.03 వరకు దుర్ముహూర్తం ఉ.5.35 నుంచి 7.21 వరకు అమృతఘడియలు... రా.2.50 నుంచి 4.36 వరకు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం: దూరప్రయాణాలు. ఆదాయం కొంత తగ్గి రుణాలు చేస్తారు. బంధువులు,స్నేహితుల నుంచి విమర్శలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యపరమైన చికాకులు. వ్యాపారాలలో లాభాలు కొద్దిగానే లభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం:చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి. సన్నిహితులు మీకు చేదోడుగా నిలుస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం మరింత పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సమస్యల పరిష్కారం..

మిథునం..వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. సన్నిహితులు కొంత సహాయపడతారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. 

కర్కాటకం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు చివరిలో వాయిదా పడతాయి. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. 

సింహం:రుణాలు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. కొన్నికార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య..కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపార
లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

తుల...కొత్త్త కార్యక్రమాలకు శ్రీకారం.  ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరణ దిశగా సాగుతాయి.
ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. 

వృశ్చికం...కార్యక్రమాలలో అవరోధాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార లావాదేవీలలో అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగవర్గాలకు అదనపు బాధ్యతలు.

ధనుస్సు...రాబడి తగ్గి అప్పులు చేయాల్సివల్తుంది. .ప్రయాణాలలో ఆటంకాలు. బంధుగణంతో విభేదాలు.కార్యక్రమాలు ముందుకు సాగవు.  వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం..ముఖ్య∙కార్యక్రమాలలో విజయం. అదనపు రాబడి. దీర్ఘ్ఘకాలిక సమస్యలు తీరి ఊరటచెందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు, 

కుంభం..కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా బదిలీలు.

మీనం..కొత్త కార్యక్రమాలు చేపడతారు. రావలసిన బాకీలు అందుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు. 

మరిన్ని వార్తలు