గ్రహం అనుగ్రహం(12-02-2020)

12 Feb, 2020 07:28 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, తిథి బ.తదియ ఉ.7.13 వరకు, తదుపరి చవితి తె.4.50 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం ఉత్తర సా.4.24 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.12.13 నుంచి 1.44 వరకు, దుర్ముహూర్తం ప.11.50 నుంచి 12.37 వరకు అమృతడియలు... ఉ.9.43 నుంచి 11.10 వరకు.

సూర్యోదయం :    6.32
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

మిథునం: చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

కన్య: భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

తుల: శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మకరం:  బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. దూరప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల పరిష్కారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు