గ్రహం అనుగ్రహం (13-05-2020)

13 May, 2020 04:57 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.షష్ఠి ప.9.24 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.8.20 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం ప.12.30 నుంచి 2.10 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.22 వరకు అమృతఘడియలు... ఉ.10.23 నుంచి 11.24 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

గ్రహఫలం
మేషం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వస్తులాభాలు.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నిర్ణయాలలో మార్పులు. ఆలయ దర్శనాలు.  అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: నూతన ఉద్యోగలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పోత్సాహం.

ధనుస్సు: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: దూరపు బంధువులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: ఇంటర్వ్యూలు రాగలవు. కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

మీనం: కుటుంబంలో చికాకులు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. 

మరిన్ని వార్తలు