గ్రహం అనుగ్రహం (13-08-2019)

13 Aug, 2019 13:57 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి శు.త్రయోదశి ప.1.38 వరకు
తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ తె.5.38 వరకు
(తెల్లవారితే బుధవారం) తదుపరి శ్రవణం, వర్జ్యం ప.12.43 నుంచి 2.23 వరకు
దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.06 వరకు
తదుపరి రా.10.55 నుంచి 11.40 వరకు,
మృతఘడియలు... రా.10.51 నుంచి 12.33 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

 

మేషం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పా తమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం. 

సింహం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కన్య: ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువుల కలయిక. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం: సన్నిహితుల నుంచి కొద్దిపాటి సమస్యలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. వాహనయోగం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మీనం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు