గ్రహం అనుగ్రహం (13-11-2019)

13 Nov, 2019 06:08 IST|Sakshi

శ్రీవికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.పాడ్యమి రా.7.20 వరకు, తదుపరి విదియ, నక్షత్రం కృత్తిక రా.10.32 వరకు,తదుపరి రోహిణి వర్జ్యం ఉ.9.56 నుంచి 11.37 వరకు,దుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.05 వరకు,అమృతఘడియలు...రా.8.01 నుంచి 9.44 వరకు.

సూర్యోదయం :    6.07
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: ముఖ్యమైన పనుల్లో  స్వల్ప  అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత  నిరాశ కలిగిస్తాయి.

వృషభం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

మిథునం: కొత్తగా రుణాలు యత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.

కర్కాటకం: సన్నిహితులు దగ్గరవుతారు. కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి..

సింహం: నిరుద్యోగుల  ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక  పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం..

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు. ధనవ్యయం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు,  వ్యాపారాలలో కొంత  ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది.  శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు.  బంధువులతో విభేదాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.. ఆలయ దర్శనాలు.

కుంభం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. పనుల్లో శ్రమాధిక్యం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: కొత్త మిత్రుల  పరిచయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. పనుల్లో  విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. నూతన ఉద్యోగయోగం.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు