గ్రహం అనుగ్రహం (14-02-2020)

14 Feb, 2020 06:17 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, తిథి బ.షష్ఠి రా.1.16 వరకు, తదుపరి సప్తమినక్షత్రం చిత్త ప.1.10 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం సా.6.23నుంచి 7.55 వరకు, దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.33వరకు, తదుపరి ప.12.37 నుంచి 1.22 వరకుఅమృతఘడియలు... ఉ.7.09 నుంచి 8.35 వరకు.

సూర్యోదయం :    6.31
సూర్యాస్తమయం    :  5.58
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు.

వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. విలువైన సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు.  వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మిథునం: పనులలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు తప్పవు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు.  బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఒత్తిడులు.

సింహం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.  అందరిలోనూ గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కన్య: రుణ ఒత్తిడులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్య సూచనలు.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి.

వృశ్చికం: ముఖ్యమైన  పనులు సమయానికి పూర్తి. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

ధనుస్సు: పనుల్లో కొంత జాప్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం:  కొత్త పనులు చేపడతారు. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మీనం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్యం మందగిస్తుంది. – సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు