గ్రహం అనుగ్రహం (14-12-2019)

14 Dec, 2019 06:53 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, తిథి బ.విదియ ఉ.9.43 వరకు తదుపరి తదియ, నక్షత్రం ఆరుద్ర ఉ.7.20 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం రా.7.02 నుంచి 8.36 వరకు, దుర్ముహూర్తం ఉ.6.24 నుంచి 7.51 వరకు, అమృతఘడియలు... తె.4.23 నుంచి 5.56 వరకు (తెల్లవారితే ఆదివారం).

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం:    కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: కొత్త పనులు చేపడతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య: పనులలో పురోగతి. సోదరుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులు  వాయిదా. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విచిత్ర సంఘటనలు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు