గ్రహం అనుగ్రహం (15-01-2020)

15 Jan, 2020 06:24 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరందక్షిణాయనం, హేమంత ఋతువుపుష్యమాసం, తిథి బ.పంచమి సా.4.05 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పుబ్బ ఉ.9.50 వరకు,తదుపరి ఉత్తర,వర్జ్యం సా.4.33 నుంచి 6.02 వరకు, దుర్ముహూర్తంప.11.45 నుంచి 12.30 వరకు, అమృతఘడియలు...రా.1.29 నుంచి 2.44 వరకు.మకర సంక్రాంతి, ఉత్తరాయణం ప్రారంభం.

సూర్యోదయం        :  6.38
సూర్యాస్తమయం    :  5.40
రాహుకాలం :  సా.12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ప.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృషభం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మిథునం:  మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం:  కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు న త్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కన్య: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి.  ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

వృశ్చికం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. నూతన ఒప్పందాలు. ఆధ్యాత్మిక చింతన. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

దనుస్సు: కొత్తరుణాలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చికాకులు తప్పవు. ఆలయ దర్శనాలు.

మకరం: ప్రయాణాలలో మార్పులు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. సన్నిహితులతో వివాదాలు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందగోళం తొలగుతుంది.

మీనం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి లాభం. పనులు చకచకా సాగుతాయి. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు