గ్రహం అనుగ్రహం (15-03-2020)

15 Mar, 2020 05:23 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.షష్ఠి ఉ.10.44 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం అనూరాధ సా.5.22 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్య రా.10.48 నుంచి 12.21 వరకు దుర్ముహూర్తం సా.4.29 నుంచి 5.16 వరకు, అమృతఘడియలు... ఉ.7.23 నుంచి 9.43 వరకు.

సూర్యోదయం        :  6.13
సూర్యాస్తమయం    :  6.05
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 
వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. 
మిథునం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం.
కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. 
సింహం: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. 
కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. 
తుల: రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృశ్చికం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 
ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 
కుంభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 
మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విద్యార్థులకు మంచి ఫలితాలు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు