గ్రహం అనుగ్రహం (15-05-2020)

15 May, 2020 06:03 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.అష్టమి ప.10.32 వరకు, తదుపరి నవమి నక్షత్రం ధనిష్ఠ ప.10.46 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం. రా.6.32 నుంచి 8.16 వరకు, దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 8.57 వరకు తిరిగి ప.12.22 నుంచి 1.13 వరకు, అమృతఘడియలు... ఉ.4.54 నుంచి 6.34 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

దినఫలాలు
మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త ఆశలు.

వృషభం:సన్నిహితులు, స్నేహితుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

మిథునం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.

కర్కాటకం: ఆరోగ్య, కుటుంబసమస్యలు.  వ్యాపారులకు నిరుత్సాహం. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సామాన్యస్థితి.

సింహం: ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. దేవాలయ దర్శనాలు. ధనలాభం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి.

కన్య:అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అదనపు ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

తుల: సన్నిహితులతో సఖ్యత. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు.

వృశ్చికం: బంధువులు అపవాదులు మోపుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

ధనుస్సు: ఆకస్మిక  ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారులు  ముందడుగు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. దేవాలయ దర్శనాలు.

మకరం: ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. దేవాలయదర్శనాలు. వ్యాపారులు ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు.  వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. దేవాలయాలు సందర్శిస్తారు.

మీనం: ప్రయాణాల్లో మార్పులు. వృథా ఖర్చులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, స్నేహితుల నుంచి విమర్శలు. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు చిక్కులు.

మరిన్ని వార్తలు