గ్రహం అనుగ్రహం (17-01-2020)

17 Jan, 2020 07:17 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి బ.సప్తమి ఉ.11.21  వరకు, తదుపరి అష్టమి నక్షత్రం  చిత్త తె.5.01 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి స్వాతి, వర్జ్యం ప.2.01 నుంచి 3.30 వరకు, దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.34 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.15 వరకు, అమృతఘడియలు... రా.11.01 నుంచి 12.25 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.42
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు.ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం, వైద్యసేవలు.  పనుల్లో అవాంతరాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధుమిత్రులతో వివాదాలు. ఆస్తి విషయంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

తుల: మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలోపాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

దనుస్సు: అనుకున్న పనులు చకచకా సాగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. నూతన ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: పనులలో అవాంతరాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా