గ్రహం అనుగ్రహం (17-07-2020)

17 Jul, 2020 06:15 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, తిథి బ.ద్వాదశి రా.10.50 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం రోహిణి రా.7.43 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ఉ.11.06 నుంచి 12.50 వరకు, తదుపరి రా.1.34 నుంచి 3.15 వరకు దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.45 వరకు, తదుపరి ప.3.05 నుంచి 3.57 వరకు, అమృతఘడియలు... సా.4.10 నుంచి 5.54 వరకు.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం.....నిర్ణయాలు మార్చుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

వృషభం..వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం...ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

కర్కాటకం....యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం...ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య....రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలలో ఆటంకాలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల...చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆసక్తికర సమాచారం. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ  వాయిదా. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికం...బధువుల కలయిక. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి.

ధనుస్సు....పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రగతి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. పాతమిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

మకరం....ఆశ్చర్యకరమైన సంఘటనలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

కుంభం...వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం....సన్నిహితుల నుంచి ధనలాభం. పనులలో విజయం. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మరిన్ని వార్తలు