గ్రహం అనుగ్రహం (18-06-2020)

18 Jun, 2020 06:09 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.ద్వాదశి ఉ.8.54 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం భరణి ఉ.8.22 వరకు తదుపరి కృత్తికవర్జ్యం రా.9.23 నుంచి 11.07 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.43 వరకు తిరిగి ప.3.04 నుంచి 3.56 వరకు అమృతఘడియలు..లేవు

సూర్యోదయం 5.29
సూర్యాస్తమయం  6.31
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

దినఫలాలు
మేషం :పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  సోదరులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు.

మిథునం:మీ ప్రతిభ నిరూపించుకుంటారు. యత్నకార్యసిద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. వాహనయోగం.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. వస్తులాభాలు.

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు.

తుల: ఆకస్మిక ధనలబ్ధి. విద్యార్థులకు శుభవార్తలు. ఆలోచనలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు విజయవంతంగా సాగుతాయి.

వృశ్చికం:పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు

ధనుస్సు: సోదరులతో విభేదాలు, అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మానసిక అశాంతి. పనులు వాయిదా వేస్తారు.

మకరం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు. మిత్రుల  నుంచి ధనలాభం. కుటుంబంలో సంతోషకర వాతావరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. నిర్ణయాలు వాయిదా.

మరిన్ని వార్తలు