-

గ్రహం అనుగ్రహం (18-07-2020)

18 Jul, 2020 06:30 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.త్రయోదశి రా.11.21 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం మృగశిర రా.8.55 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం తె.5.35 నుంచి 7.15 వరకు (తెల్లవారితే ఆదివారం) దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు, అమృతఘడియలు... ఉ.11.34 నుంచి 12.42 వరకు, శనిత్రయోదశి.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం.....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనుల్లో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం....వ్యవహారాలలో అవరోధాలు. ఇంటాబయటా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

మిథునం...ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన.  కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు.

కర్కాటకం..బంధువులతో వివాదాలు. ధనవ్యయం. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు.

సింహం..కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య.....నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల....కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలలో నిరుత్సాహం.

వృశ్చికం.....వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు...ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం.....ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం....రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

మీనం....ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు